Actress Rambha Health Update: రోడ్డు ప్రమాదానికి గురైన నటి రంభ, ఆమె పిల్లలు, అందరూ బాగానే ఉన్నామంటూ ట్వీట్, కూతురు సాషాకు చిన్న గాయాలయ్యాయని వెల్లడి
ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.
సీనియర్ హీరోయిన్, నటి రంభ ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రంభ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.
పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా... ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేమంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’ అంటూ ఆమె పోస్ట్ చేసింది.
Ouw car was hit by another car at an intersection wayback from picking kids from school! "Me with kids and my nanny" All of us are safe with minor injuries 😔my little Sasha is still in the hospital 😞 bad days bad time 😪😰please pray for us 🙏 your prayers means a lot 🙏🙏 pic.twitter.com/BqgrNjfdpi
— Rambha Indrakumar (@Rambha_indran) November 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2022 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

