ANR Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఎమోషనల్ వీడియోను ట్వీట్ చేసిన అక్కినేని నాగార్జున, నాన్నకు పంచె అంటే ఎంతో ఇష్టమని తెలిపిన మన్మథుడు

తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్‌ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు

ANR Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఎమోషనల్ వీడియోను ట్వీట్ చేసిన అక్కినేని నాగార్జున, నాన్నకు పంచె అంటే ఎంతో ఇష్టమని తెలిపిన మన్మథుడు
A file image of Tollywood actor Akkineni Nagarjuna

తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్‌ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్‌ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు. కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 20, 2021 02:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).