Hyderabad, Aug 19: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ (BRS) నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandra Sekhar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు. మెగా కుటుంబంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నటుడిగా బన్నీ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని, రాజకీయంగా కూడా ఆయన సేవలు అవసరమని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)