Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా, విషాద సమయంలో సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని తెలిపిన పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు.
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశాడు. 'మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. దీని వివరాలను చిత్రనిర్మాణ సంస్థ తెలియజేస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won't be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2022 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

