HCA Awards 2023: జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు హెచ్సీఏ అవార్డులు, స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న తారక్
హెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది.
HCA అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది. తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఆయన అమెరికాకు రాలేకపోయినట్టు తమకు తెలిపారని వెల్లడించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన అవార్డుల ట్రోఫీలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు తారక్ వచ్చినట్టు తెలిపింది. స్పాట్ లైట్ అవార్డును అలియా భట్ కు కూడా హెచ్సీఏ ప్రకటించింది. 'డియర్ ఆర్ఆర్ఆర్ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్... జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాం. వచ్చే వారం ఈ అవార్డులను వారికి పంపిస్తున్నాం' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.
Here's HCA Tweet
Dear RRR supporters & fans,
We would like to share with you the awards for N.T Rama Rao Jr. & Alia Bhatt.
We will be sending them out next week.
Thank you for all your love and support.
The Hollywood Critics Association #RRRGoesGlobal #RRRMovie #AliaBhatt #NTRamaRaoJr pic.twitter.com/fvc7stfXqD
— Hollywood Critics Association (@HCAcritics) March 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

