Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్‌ సీన్లపై మండిపడిన నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.

Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్‌ సీన్లపై మండిపడిన నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
HYD Police Commissioner CV Anand (Photo: Twitter/@CPHydCity)

బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.

సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో వున్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్‌గా నవదీప్ వున్నాడని ఆయన చెప్పారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశానని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. రాంచంద్‌ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. షాడో ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి కూడా పరారీలో వున్నాడని ఆనంద్ వెల్లడించారు.

HYD Police Commissioner CV Anand (Photo: Twitter/@CPHydCity)

Here's NTV Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 14, 2023 06:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).