Rajnath Singh Meets Prabhas: ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి
సినీ నటుడు, బీజేపీ నేత దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.
సినీ నటుడు, బీజేపీ నేత దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్ ను రాజ్ నాథ్ పరామర్శించారు.
కృష్ణం రాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బీజేపీ నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.
Telangana | Defence Minister Rajnath Singh meets the family members of veteran Telugu actor and former Minister of State for Defence, Late Krishnam Raju Garu, in Hyderabad
Telugu actor Prabhas also present. pic.twitter.com/Tf5ZyUwQwu
— ANI (@ANI) September 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 16, 2022 03:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

