Nagababu Apology Note: హైట్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నాగబాబు, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry అంటూ ట్వీట్
నాగబాబు తాజాగా క్షమాపణలు తెలిపారు. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు, అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను”.. అంటూ నాగబాబు ఎక్స్ లో రాశారు.
నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోల హైట్ గురించి పరోక్షంగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. సినిమాలలో ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే వారు పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తే అంతగా నమ్మేలా ఉండవని సెటైర్లు వేశారు.
వరుణ్ తేజ్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఛాలెంజింగ్, రిస్కుతో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని చెప్పారు. ఇది ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని.. ముఖ్యంగా ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ హైట్, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయని చెప్పారు. 5.3 అడుగులు ఉండే హీరో ఇలాంటి పాత్రలు వేస్తే అతడికి ఆ పాత్ర బాగుండదని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూమారం రేపాయి. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్ సేన్ గామి ట్రైలర్, మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అంటూ..
పలు అభిమానుల సంఘాలు ఎక్స్ వేదిక ద్వారా నాగబాబును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నాగబాబు తాజాగా క్షమాపణలు తెలిపారు. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు, అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను”.. అంటూ నాగబాబు ఎక్స్ లో రాశారు.
Here's His Tweet
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

