Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!
2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
Hyderabad, May 21: 2016లో విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు (Record Collections) రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు. తెలుగులో 2016 మే 13న బిచ్చగాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత సుమారు ఐదారు నెలలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొన్న‘బిచ్చగాడు 2’ సినిమా రిలీజ్ అయింది. అదే రోజే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ప్రకటించింది. రెండు సంఘటనలూ యాదృచ్ఛికంగానే జరిగినా.. రెండింటికీ ముడిపెడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని మీరూ చూడండి.
బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ
బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ
———————
ఈ లింకేమిటి సామీ? pic.twitter.com/N7xM4XtAsV
— Nellore PeddaReddy (@Tenali_RK) May 19, 2023
బిచ్చగాడు మొదటి రిలీజ్ కి....500..వేయినొట్లు.
బిచ్చగాడు రెండో రిలీజ్ కి 2000 నోట్లు రద్దు చేశారు జానకీ..
మూడో రిలీజ్ కి ఏమి రద్దు చేస్తారో... ఏమిటో జానకీ..
— kumarkaza (@kumarkaza2) May 20, 2023
బిచ్చగాడు 1 లో నోట్ బ్యాన్ కోసం explain చేసాడని నోట్ బ్యాన్ అప్పుడు ఒక్క scene చక్కర్లు కొట్టింది.
బిచ్చగాడు 2 చూడలేదు అందులో ఏమైనా 2000 బ్యాన్ కోసం ఏమైనా scene ఉందా???#Bichagadu2
— Dagam (@Dagam_offl) May 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 21, 2023 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

