ప్రముఖ కొరియన్ నటుడు'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమా పారాసైట్ హీరో లీ సన్ క్యూన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. కారులో విగతజీవిగా కనిపించాడు. అతనిపై చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు.

అయితే సడన్‌గా లీ సన్ క్యూన్ కనిపించడం లేదని రెండు మూడు రోజుల క్రితం ఇతడి భార్య కంప్లైంట్ చేసింది. దీంతో ఎక్కడికి వెళ్లాడా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంట్లోనే ఇతడి సూసైట్ నోట్ దొరికింది. అలానే పార్కింగ్ చేసిన కారులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని లీ భార్య పోలీసులు చెప్పింది. ఇతడి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతడు చనిపోయాడా? ఎవరైనా చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)