హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. అప్పుడు ఏదో ఓ రకంగా నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి నా గురించి మాట్లాడిన మాటలని కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా' అని చెప్పారు.

వ్యాపార పరంగా వచ్చే విమర్శలని ఆయా వెబ్‌సైట్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హనుమాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్‌సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా' అని దిల్‌రాజు హెచ్చరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)