PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్
ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.
Hyderabad, April 22: విక్రమ్ (Vikram), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), కార్తి (Karthi), త్రిష (Trisha), జయం రవి (Jayam Ravi), జయరామ్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్.. ప్రధానమైన పాత్రలలో నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' విజయం తర్వాత ఇప్పుడు మణిరత్నం అభిమానులంతా 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వివిధ భాషల్లో ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. భారీ తారాగణమంతా ఈవెంటుకు హాజరుకానుంది.
The Cholas are coming to Hyderabad!
On April 23rd at 5:30 PM📍Novotel Hyderabad Convention Centre.#PS2 in cinemas worldwide from 28th April in Tamil, Hindi, Telugu, Malayalam, and Kannada!#CholasAreBack#PS2 #PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_… pic.twitter.com/lbcmlb1ENO
— Lyca Productions (@LycaProductions) April 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 22, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

