ఏపీ రాజకీయాలకు సంబంధించి మరొక చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఆర్జీవీ వ్యూహం, ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా యాత్ర-2 వస్తుండగా వాటికి తోడుగా అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ అనే చిత్రం రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రధారులుగా వ‌స్తున్న ఈ సినిమాను భాను దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కంఠంనేని రవిశంకర్ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా తాజాగా మూవీ మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. శ్రీమతి బిందు సమర్పణలో వ‌స్తున్న ఈ సినిమాలో వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు నటిస్తుండ‌గా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Here's Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)