Klin Kaara Konidela Welcome Video: చిరంజీవి మనవరాలు క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియో ఇదిగో, ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ సాగిన వీడియో

ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు.

Klin Kaara Konidela Welcome Video: చిరంజీవి మనవరాలు క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియో ఇదిగో, ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ సాగిన వీడియో
Ram Charan & Upasana Konidela

ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. ఈ రోజుతో తమ కుమార్తె క్లీంకార జన్మించి నెల రోజులు అవుతోన్న సందర్భంగా.. పాప పుట్టిన సమయంలో (జూన్‌ 20) తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోతో ఆయన తెలియజేశారు.

క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నారు. రామ్ చరణ్ ల పెళ్లి, ఇంకా పిల్లలు పుట్టలేదని సాగిన ప్రచారం, రామ్ చరణ్ ఆవేదన, ఉపాసన గర్భవతి కావడం, ఆమెకు అపోలో ఆసుపత్రిలో ప్రసవం, మెగా ఇంట సంబరాలు, పాపకు బారసాల, నామకరణం... ఇలా వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Ram Charan & Upasana Konidela

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 20, 2023 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).