తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. దీనిపై వర్మ సెటైర్ వేశాడు. తాను రూపొందించిన‌ "ప‌వ‌ర్ స్టార్‌ ఆర్జీవీ మిస్సింగ్" ట్రైల‌ర్ చూసే బాబు ఏడ్చేశాడంటున్నాడు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి, ఆయ‌నే మాట్లాడుతున్న‌ట్లుగా ఓ మిమిక్రీ వాయిస్‌ను జ‌త చేశాడు.

ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు' అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా ఉంది. దీనికి వ‌ర్మ‌.. 'ఇందాకే బాబు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న స్పంద‌న‌కు ధ‌న్య‌వాదాలు' అని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఈ ర‌కం ప్ర‌మోష‌న్స్ తామెక్క‌డా చూడ‌లేదు అని ముక్కున వేలేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)