Superstar Krishna No More: తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం, సూపర్ స్టార్ మృతిపై సంతాపం తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ..ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి.

Superstar Krishna No More: తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం, సూపర్ స్టార్ మృతిపై సంతాపం తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
M Venkaiah Naidu. (Photo Credits: Twitter@VPSecretariat)

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ..ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.తన సినిమాల్లో ప్రయోగాలకు పెద్ద పీట వేసిన శ్రీ కృష్ణ గారు, అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. సగటును ఏడాదికి పది సినిమాల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేయటం వారి నిబద్ధతకు నిదర్శనం. తెలుగు తెరపై వారి స్ఫూర్తి అజరామరం.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 15, 2022 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).