Sanatana Dharma Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, ఉదయనిధికి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్

ప్రముఖ దక్షిణాది నటుడు సత్యరాజ్ కూడా తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు

Sanatana Dharma Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, ఉదయనిధికి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్
Actor Sathyaraj supports Tamil Nadu minister Udayanidhi Stalin (Photo-Wikimedia commons, FB)

తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆయనకు మద్దతిస్తున్నారు.

ప్రముఖ దక్షిణాది నటుడు సత్యరాజ్ కూడా తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించినందుకు ఆయనను అభినందిస్తున్నానని సత్యరాజ్ తెలిపారు. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యాచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నామని అన్నారు.

Actor Sathyaraj supports Tamil Nadu minister Udayanidhi Stalin

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 07, 2023 07:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).