Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు

ప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.

Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు
Sarath Babu (Photo-Video Grab)

ప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో శరత్‌బాబు సోదరి స్పందిస్తూ.. శరత్‌బాబు మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని, రూమ్‌కి షిఫ్ట్‌ చేశారని తెలిపారు.

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే శరత్‌బాబు పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, తమ స్వగ్రామంలో ఉన్న శరత్‌బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదని మీడియాకు వెల్లడించారు. శరత్‌ బాబుకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Here's Update News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 03, 2023 09:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).