ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్యహత్య? లేదా ఎవరీ పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 35 ఏళ్లకే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)