సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల రూమర్స్ పై హేమచంద్ర దంపతులు స్పందించారు.నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్‌ ఛానల్‌లోని వీడియోలకు వ్యూస్‌ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది. శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)