Sonu Sood: సోనూ ప్రధాని కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్, ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేసిన సోనూ సూద్

బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సోనూ స్పందించాడు. మంగళవారం రోజు తన అపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్‌​ సమ్మర్ డ్రింక్స్ అందించాడు.

Sonu Sood: సోనూ ప్రధాని కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్, ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేసిన సోనూ సూద్
Sonu Sood (photo credit: Instagram)

ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను దేశానికి ప్రధానిగా చూడాలనుకునే ప్రజల అభిప్రాయలపై స్పందించమని నటుడిని కోరాడు. అనంతరం సోనూ స్పందిస్తూ.. రాజీకీయాలపై ఆసక్తి లేదని సాధారణ వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేశాడు.

‘నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాడటం ద్వారా నేను ఏం పొందుతాను? అది నా పని కాదు.’ అని బదులిచ్చాడు. కాగా సోనూను ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో రాఖీ సావంత్‌ ఒక్కరే కాదు. కొన్ని రోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ప్రచారానికి ట్విట్టర్‌లో వేలాది గొంతులు తోడయ్యాయి.

Here's Update

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 12, 2021 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).