తెలుగులో నటుడిగా అనేక సినిమాలలో నటించి సత్తా చాటిన శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. నెట్టింట్లో ఆయన మాటలు, వీడియోలు, చేష్టలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఏపీ మద్యం బూం బూం తాగుతున్నానని, ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదంటూ భయపడుతూ బీరు తాగేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ అయ్యంగార్ అని అంటూనే సారీ పేరు మారింది కదా తాను శ్రీకాంత్ భారత్ అని అంటూ మరో సెటైర్ వేశాడు.

శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఏపీలో మాత్రమే మందు మీద ఆయన కౌంటర్ వేశాడని కొందరు అంటుంటే భారత్ అని పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం మీద ఆయన కౌంటర్ వేశాడని మరికొందరు అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Srikanth Boom Boom Beer Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)