దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్రరావు డిజిటల్ బాట పట్టారు. కేఆర్ఆర్ వర్క్స్’ పేరిట సరికొత్త యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేశారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. కొత్త వారిని వెండి తెరకు పరిచయం చేయాలని ‘కేఆర్ఆర్ వర్క్స్’ చానెల్ ఏర్పాటు చేశారు. దీన్ని నేను ప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. 80 ఏళ్ల యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఆల్ ది బెస్ట్’ అని రాజమౌళి చెప్పారు. సామాన్యులను సెలబ్రిటీలను చేయడం కోసం రాఘవేంద్రరావు ఈ చానల్ ప్రారంభించారని యాంకర్ సుమ చెప్పారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్ర్కిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకోవాలని సూచించారు.

Here's Director Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)