Superstar Krishna Turns 78: డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ, మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను నాన్న అంటూ కొడుకు మహేష్ బాబు ట్వీట్
తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
'హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను నాన్న' అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. నిజానికి మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’ నుంచి టీజర్‌ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. కొవిడ్ కారణంగా అభిమానులు, సన్నిహితులు కృష్ణ బర్త్ డే వేడుకలను నిర్వహించడం లేదు. సోషల్ మీడియాలోనే ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలియజేస్తున్నారు.
Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 31, 2021 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

