Actor Ramadoss Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూత, సంతాపం తెలిపిన తమిళ సినీ ప్రముఖులు
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దర్శకుడి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన రాజా రాజాదాన్, కల్యాణం, రావణన్, వాళ్గ జననాయకంనెంజం ఉండు నేర్మై ఉండు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అధేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.
Here's Update
Tamil Actor And Director E Ramadoss Dies At 66 https://t.co/0Fl2G7HhXu pic.twitter.com/UimBfif8Rt
— NDTV News feed (@ndtvfeed) January 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 25, 2023 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

