Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..
ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాలను (two Telugu states) వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం
Here's Tweet
#NBK donated 50 lakhs each to the CM Relief Fund of Telangana & Andhra Pradesh❤️👏
50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది..
50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది..
తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో… pic.twitter.com/emRH8bVQJz
— manabalayya.com (@manabalayya) September 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 03, 2024 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

