తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని మరొక్కసారి మోహన్ బాబు ఫోటో ద్వారా గుర్తు చేసుకున్నారు.ఈ ట్వీట్‌లో గద్దర్‌ను శాలువాతో సన్మానిస్తోన్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఉన్నారు.  ఇకపై ప్ర‌తీ సంవ‌త్స‌రం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌, పుర‌స్కారం పేరు మార్చుతూ త్వ‌ర‌లోనే జీవో జారీ

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)