Recipe Challenge: టాలీవుడ్‌లో కొత్తగా రెసిపీ ఛాలెంజ్ వైరల్, ప్రభాస్‌కు ఫుడ్ ఛాలెంజ్ విసిరిన అనుష్క, తర్వాత రాంచరణ్‌కు ఛాలెంజ్ విసిరిన రెబల్ స్టార్, చెర్రీ ఎవరికి విసిరారంటే..

హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి, తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యొక్క ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.

Recipe Challenge: టాలీవుడ్‌లో కొత్తగా రెసిపీ ఛాలెంజ్ వైరల్, ప్రభాస్‌కు ఫుడ్ ఛాలెంజ్ విసిరిన అనుష్క, తర్వాత రాంచరణ్‌కు ఛాలెంజ్ విసిరిన రెబల్ స్టార్, చెర్రీ ఎవరికి విసిరారంటే..
Prabhas and Anushka and Ram Charan (Photo/Insta)

హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి, తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యొక్క ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్ ను ప్రారంభించింది స్వీటీ. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ కు చాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని అందరితో పంచుకున్నానని... ఇప్పుడు ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నానని చెప్పింది.

ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాన్ని ఎలా చేయాలో పంచుకున్నాడు. తర్వాత రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ కు చరణ్ స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని తెలియజేశాడు. రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. రేపు రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ చిత్రం పెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది.

Prabhas and Anushka and Ram Charan (Photo/Insta)

Here's Food Challenge

Prabhas Food Challenge

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Here's Ram Charan Challange

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 06, 2023 06:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).