ఏపీ రాజకీయాల మీద వ్యూహం, శపథం సినిమాలతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెడీ అయిన సంగతి విదితమే. తాజాగా ఓ వీడియోతో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాక్సింగ్‌ రింగ్‌లో ఎంటర్‌ అయితే గట్టిగా గుద్దాలి. అంతేగానీ జుట్టు పీకుతా.. చెంప గిల్లుతా అనే ఆటిట్యూడ్‌తో ఉండకూడదు. అది నా ఫిలాసఫీ. వ్యూహం, శపథం సినిమాలతో నిజాన్ని బట్టలిప్పి చూపించడం అనేదే నా ఉద్దేశం. ఈ సినిమాని టీడీపీ, జనసేవాళ్లు చూస్తారా? అని కొందరు అడుగుతున్నారు.

సికింద్రాబాద్‌లో లంబా థియేటర్‌ అనేది ఉండేది. అందులో సెక్స్‌ సినిమాలు ఆడేవి. సెక్స్‌ అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది భయం భయంతో ఆ థియేటర్‌కు వెళ్లేవాళ్లు కాదు. కానీ, నా దృష్టిలో లంబా థియేటర్‌ చేసింది ప్రజాసేవ. నేను పోర్న్‌ చూసినట్లే.. ఎవ్వరికీ తెలియకుండా టీడీపీ, జనసేన వాళ్లు బాత్రూమ్‌లలో కూర్చుని వ్యూహం, శపథం సినిమాలు చూస్తారని తెలిపారు.వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న విడుదల కానున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)