బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలని వీడియోలో అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)