CBSE 12th Board Exams Cancelled: సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు, పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, కరోనావైరస్ తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

CBSE 12th Board Exams Cancelled: సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు, పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, కరోనావైరస్ తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
CBSE 12th Board Exams Cancelled

కరోనావైరస్‌ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనావైరస్ తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2021 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).