Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట.. ఉజ్వల యోజన మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ

గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు.

Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట.. ఉజ్వల యోజన మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ
Credits: Twitter

Newdelhi, March 25: గ్యాస్ (Gas) వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని (Subsidy) ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా రూ.6,100 కోట్లు ఖర్చు చేశారు. ఉజ్వల సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ,భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే మే 22, 2022 నుంచి ఈ సబ్సిడీని ఇస్తున్నాయి.

Vande Bharat Express: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వచ్చేనెలలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశాలు.. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో భారీగా ప్రయాణికుల రద్దీ.. వందేభారత్ తో తిరుమల భక్తులకు మరింత ఉపయుక్తం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 25, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).