Jammu And Kashmir: జమ్మూలో లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి, విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా విరిగిపడిన మంచు పెళ్లలు
జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు.
జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు.ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు.పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Here's Update
Incident #ChinarWarriors in #Machhal Sector. During a regular op task in forward area, a party of 01 JCO & 02 OR slipped into a deep gorge, when snow on the track gave way. Mortal remains of all the three #bravehearts have been retrieved. Further details follow.@NorthernComd_IA pic.twitter.com/AjULhI33Ne
— Chinar Corps? - Indian Army (@ChinarcorpsIA) January 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2023 10:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

