Bharat Drone Mahotsav 2022: డ్రోన్‌ను ఎగరవేసిన ప్రధాని మోదీ, పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన డ్రోన్‌ను ఎగురవేశారు. పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది. ఈ ఎగ్జిబిషన్‌లో 70కిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వివిధ సందర్భాల్లో ఉపయోగించే డ్రోన్లను ప్రదర్శించారు.
- Read in
- తెలుగు
బెంగళూరుకు చెందిన ఫుల్ స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 (Drone Festival of India 2022)లో పాల్గొంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA), డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DFI) కలిసి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ రేపటి (శనివారం)తో ముగియనుంది. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన డ్రోన్‌ను ఎగురవేశారు.
పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది. ఈ ఎగ్జిబిషన్‌లో 70కిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వివిధ సందర్భాల్లో ఉపయోగించే డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
#WATCH | PM Narendra Modi tried his hand at flying a drone during the inauguration of two-day Bharat Drone Mahotsav 2022 at Pragati Maidan in Delhi pic.twitter.com/XNto9g28PY
— ANI (@ANI) May 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 27, 2022 07:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

