Bihar Shocker: ప్రేమను అంగీకరించనందుకు నడిరోడ్డుపై తుపాకీతో కాల్పులు, బీహార్‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, కూరగాయల వ్యాపారి కూతురిపై కాల్పులు జరిపి పరారైన నిందితుడు, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు,కాల్పుల వీడియో ఇదే! Video|
బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదనే కారణంగా పట్టపగలే ఆమెపై కాల్పులు జరిపాడు. పాట్నాలోని సిపారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువకుడి కాల్పుల్లో గాయపడ్డ యవతిని స్థానిక కూరగాయల వ్యాపారి కూతురిగా గుర్తించారు.
- Read in
- తెలుగు
Patna, AUG 18: బీహార్‌లోని పట్నాలో (Patna) దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదనే కారణంగా పట్టపగలే ఆమెపై కాల్పులు జరిపాడు. పాట్నాలోని సిపారా (Sipara) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువకుడి కాల్పుల్లో గాయపడ్డ యవతిని స్థానిక కూరగాయల వ్యాపారి కూతురిగా గుర్తించారు. యువతి వీధిలోనుంచి వస్తుండగా ఓ యువకుడు ఆమెను దాటుకుని వచ్చి కొద్ది దూరంలో నిల్చున్నాడు. ఆమె అతడిని దాటి వెళ్లిన తర్వాత.. అప్పటికే తనతో తెచ్చుకున్న తుపాకీని (Gun) సంచిలోనుంచి తీసి ఆమె మెడపై కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు. యువకుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇదంతా ఓ ఇంటికి ఉన్న కెమెరాలో (CCTV) రికార్డయింది.
Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police
(Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1
— ANI (@ANI) August 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 2022 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

