Bulandshahr Shocker: ఛీ వీడు అసలు కన్నకొడుకేనా, కన్నతల్లిని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టిన కసాయి, గుడిలో పట్టుకుని దారుణంగా కొడుతుంటే చోద్యం చూసిన జనాలు

యూపీలోని బులంద్ షహర్ లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని కర్రతో కొడుతూ రోడ్డుపై పరిగెత్తించిన వీడియో బయటకు వచ్చింది.ఆ యువకుడు చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది.

Bulandshahr Shocker: ఛీ వీడు అసలు కన్నకొడుకేనా, కన్నతల్లిని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టిన కసాయి, గుడిలో పట్టుకుని దారుణంగా కొడుతుంటే చోద్యం చూసిన జనాలు
Man Chases, Beats Mother With Stick in Uttar Pradesh; Arrested

యూపీలోని బులంద్ షహర్ లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని కర్రతో కొడుతూ రోడ్డుపై పరిగెత్తించిన వీడియో బయటకు వచ్చింది.ఆ యువకుడు చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. సాయం చేయాలంటూ అరుస్తూ ఆ తల్లి పరిగెత్తడం చూస్తే అందరినీ కలిచివేస్తోంది. ఓ గుడి ఆవరణలో ఇదంతా జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ ఆ తల్లికి ఎవరూ సాయం చేయలేదు. చివరకు తల్లిని దొరికించుకున్న ఆ యువకుడు కట్టెతో విచక్షణారహితంగా కొట్టాడు.

అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎట్టకేలకు స్పందించిన జనం.. ఆ యువకుడిని పట్టుకుని తల్లిని కాపాడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు యువకుడిని అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమోసా షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 03, 2024 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).