Caught On CCTV: వీడియో ఇదిగో, ఆవుపై పులి దాడి, వెంటాడి పులిని తరిమి తరిమి కొట్టిన ఆవుల మంద, రాత్రంతా గాయపడిన ఆవుకు కాపలాగా నిలిచిన మిత్రులు
మధ్యప్రదేశ్ భోపాల్లోని కేర్వా ప్రాంతంలో రాత్రివేళ ఓ ఫామ్లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది.
- Read in
- తెలుగు
మధ్యప్రదేశ్ భోపాల్లోని కేర్వా ప్రాంతంలో రాత్రివేళ ఓ ఫామ్లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది. అంతే.. కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది.
ఆవుల మంద దాడిచేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 76 ఎకరాల్లో ఫామ్లో దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Video
#Video| Caught On CCTV: Herd Scares Tiger Away After It Attacks Cow On Bhopal Farm pic.twitter.com/EgilvCheTo
— NDTV (@ndtv) June 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 20, 2023 11:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

