Chhattisgarh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 20 అడుగుల లోయలో పడిన పికప్ వ్యాన్, 15 మంది అక్కడికక్కడే మృతి

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కవార్ధా (Kawardha)లో ఓ పికప్‌ వ్యాన్‌ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాలపాలయ్యారు.సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ (tendu leaves) కోసం సమీపంలోని అడవికి వెళ్లారు.

Chhattisgarh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 20 అడుగుల లోయలో పడిన పికప్ వ్యాన్, 15 మంది అక్కడికక్కడే మృతి
14 Women and One Man Killed As Mini Goods Vehicle Plunges Into Gorge in Kabirdham

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కవార్ధా (Kawardha)లో ఓ పికప్‌ వ్యాన్‌ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాలపాలయ్యారు.సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ (tendu leaves) కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న పికప్‌ వ్యాన్‌ కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ (Bahpani) గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సుమారు 25 మంది గాయాలపాలయ్యారు.ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Here's Pics

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 20, 2024 04:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).