చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ షాపింగ్ మాల్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాబు కన్న తండ్రి చేతుల్లో నుంచి జారిపడి దుర్మరణం పాలయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా బాబు ప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. వీడియో వివరాల ప్రకారం.. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట షాపింగ్ కోసం వచ్చింది. భార్య షాపింగ్ చేస్తుండగా పిల్లలతో కలిసి భర్త బయట నిలుచున్నాడు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, మరొకరు ఏడాది వయసున్న పసికందు. ఇంతలో ఎస్కలేటర్ ఎక్కేందుకు పెద్ద కొడుకు మారాం చేయడం, వద్దంటూ తండ్రి కట్టడి చేయడం కనిపించింది.  బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్

ఈ క్రమంలో భుజానికి ఎత్తుకున్న చిన్న కొడుకు జారి కిందపడ్డాడు. పై ఫ్లోర్ నుంచి కింద పడడంతో బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాబు ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. తన చేతుల్లో నుంచి కొడుకు జారి పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)