Covid in India: దేశంలో మొదటిసారిగా బీఏ.4, బీఏ.5 ఉనికి గుర్తింపు, గత 24 గంటల్లో 2022 మందికి కరోనా, 14,832 కేసులు యాక్టివ్
దేశంలో గత 24 గంటల్లో 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి
దేశంలో గత 24 గంటల్లో 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 46 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 1,92,38,45,615 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో ఆదివారం ఒకేరోజు 8,81,668 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది. కాగా, దేశంలో మొదటిసారిగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లయిన బీఏ.4, బీఏ.5 ఉనికిని గుర్తించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ తరహా కేసులు రెండు నమోదయ్యాయని వెల్లడించింది.
#COVID19 | India reports 2,022 fresh cases, 2,099 recoveries, and 46 deaths in the last 24 hours.
Total active cases are 14,832. Daily positivity rate 0.69% pic.twitter.com/IiHj1lxv6K
— ANI (@ANI) May 23, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2022 11:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

