'Dahi' Row: పెరుగు ప్యాకెట్ల పేరును దహీగా మార్చాలని కేంద్రం ఆదేశాలు, హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అంటూ మండిపడిన తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కాకుండా హిందీలో లేబుల్ చేయాలంటూ నిర్దేశించే స్థాయికి చేరడం బలవంతంగా హిందీని విధించడమేనని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’ (Dahi) గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్‌లో కర్డ్‌గా లేదా స్థానిక భాషల్లో పేర్కొనే లేబుల్‌ను ఇకపై హిందీ భాషలో ‘దహీ’గా పేర్కోవాలని ఆదేశించింది. పాల పదార్థాలైన వెన్న, జున్ను ప్యాక్‌లను కూడా హిందీలోనే పేర్కోవాలని సూచించింది. బ్రాకెట్లలో స్థానిక భాషాల్లో పేర్లు ఉండవచ్చని పేర్కొంది.
దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కాకుండా హిందీలో లేబుల్ చేయాలంటూ నిర్దేశించే స్థాయికి చేరడం బలవంతంగా హిందీని విధించడమేనని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మాతృభాషలను నిర్వీర్యం, నిర్లక్ష్యం చేసేవారిని దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని ట్విట్టర్‌లో హెచ్చరించారు.
Here's CM Stalin Tweet
The unabashed insistences of #HindiImposition have come to the extent of directing us to label even a curd packet in Hindi, relegating Tamil & Kannada in our own states.
Such brazen disregard to our mother tongues will make sure those responsible are banished from South forever. https://t.co/6qvARicfUw pic.twitter.com/gw07ypyouV
— M.K.Stalin (@mkstalin) March 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 30, 2023 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

