Dal Lake Houseboat Fire: దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన రెండు హౌస్‌బోట్‌లు, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని తెలిపిన అధికారులు
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో రెండు హౌస్‌బోట్‌లు దగ్ధమయ్యాయి. దాల్ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్, అపోలో xI అనే రెండో హౌస్‌బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో రెండు హౌస్‌బోట్‌లు దగ్ధమయ్యాయి. దాల్ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్, అపోలో xI అనే రెండో హౌస్‌బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్‌బోట్‌లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్‌బోట్‌లు దాల్ సరస్సులో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే ఈ హౌస్‌బోట్‌లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి.
Massive fire broke out in Dal Lake this morning. Two houseboats namely Houseboat New Zealand and Houseboat Apollo Eleven gutted in fire. pic.twitter.com/ZaeB1d6x7d
— Only Kashmir (@onlykmr) January 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2022 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

