Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది

Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం
Ministry of Home Affairs. (Photo Credits: ANI)

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది. వీరిలో 15,994 బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది.

2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొంది. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం తెలిపింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 26, 2023 08:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).