Delhi Govt vs Lieutenant Governor Case Verdict: కేంద్రానికి భారీ షాక్, కేజ్రీవాల్‌ సర్కార్‌కు ఊరట, పాలనలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవనే 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Delhi Govt vs Lieutenant Governor Case Verdict: కేంద్రానికి భారీ షాక్, కేజ్రీవాల్‌ సర్కార్‌కు ఊరట, పాలనలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court. (Photo Credits: PTI)

ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవనే 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. శాంతిభద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని పేర్కొంది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య చాలా కాలంగా వివాదాలు నేపథ్యంలో వీరి అధికారాల పరిధిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Here's Live Law Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 11, 2023 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).