Delhi Horror: షాకింగ్ వీడియో ఇదిగో, ఢిల్లీలో కత్తితో గొంతు కోసుకుని ఓ వ్యక్తి హల్‌చల్, పోలీస్ అధికారి నుంచి పిస్టల్ లాక్కుని ముప్పతిప్పలు పెట్టిన వైనం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు.రక్తం కారుతుండగా కత్తిని చేతిలో పట్టుకుని అక్కడి రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి నుంచి పిస్టల్ లాక్కున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు.రక్తం కారుతుండగా కత్తిని చేతిలో పట్టుకుని అక్కడి రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి నుంచి పిస్టల్ లాక్కున్నాడు. దానితో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులతోపాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అతి కష్టం మీద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ పన్వర్ చేతికి గాయమైంది.
మరోవైపు గొంతు కోసుకున్న క్రిషన్‌ను జీటీబీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. భార్య నుంచి విడిపోయిన అతడు మనస్థాపంతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. కత్తితో గొంతు కోసుకుని హంగామా చేయడం, పోలీసుల నుంచి పిస్టల్ లాక్కొని గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటనలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్లిప్ వైరల్ అవుతోంది.
Here's Video
#WATCH | Two PCR calls were received at 6:40 pm & 6:50 pm on 16 March at PS MS Park that a person, Krishan Sherwal had slit his throat with a knife & was running in public near Nathu Colony chowk with a knife & a pistol in his and also opened fire: Delhi Police
(CCTV visuals) pic.twitter.com/l9FyrlIcHd
— ANI (@ANI) March 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2023 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

