Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, మెట్రోలో బట్టలు చినిగేలా తన్నుకున్న యువకులు, చర్యలు తీసుకుంటామని తెలిపిన ఢిల్లీ మెట్రో అధికారులు
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.
ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర‍్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది.
Fight Video
A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn
— Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 29, 2023 11:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

