CM Stalin Meets Vijayakanth: విజయకాంత్‌ ఇంటికి సీఎం ఎంకే స్టాలిన్‌, 15 నిమిషాల పాటు కెప్టెన్‌తో గడిపిన తమిళనాడు ముఖ్యమంత్రి, కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును సీఎంకు అందజేసిన విజయకాంత్‌

డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్‌ ఇంటికి స్టాలిన్‌ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు.

CM Stalin Meets Vijayakanth: విజయకాంత్‌ ఇంటికి సీఎం ఎంకే స్టాలిన్‌, 15 నిమిషాల పాటు కెప్టెన్‌తో గడిపిన తమిళనాడు ముఖ్యమంత్రి, కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును సీఎంకు అందజేసిన విజయకాంత్‌
CM Stalin Meets Vijayakanth (Photo-Twitter)

డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్‌ ఇంటికి స్టాలిన్‌ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్‌ను విజయకాంత్‌ కోరగా ఆయన పక్కనే కూర్చొని 15 నిమిషాల పాటు సీఎం స్టాలిన్‌ అక్కడే గడిపారు.

వారితో పాటు విజయ్‌కాంత్‌ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్‌ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్‌ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్‌ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్‌ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 12, 2021 01:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).