శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. కొద్దిరోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు.
సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులిచ్చారు. లీగల్ ప్రోసీడింగ్స్ క్లియర్ అయితే తరువాత పెళ్ళేనని అంత వరకూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటామని దువ్వాడ ప్రియురాలు మాధురీ తిరుమలలో తెలిపారు. ఇక తనకు, తన భార్య దువ్వాడ వాణికి సంబంధించిన అంశాలు ఇంకా కోర్టులోనే ఉన్నాయని, కోర్టు తీర్పు అనంతరం పెళ్లిపై నిర్ణయం ప్రకటిస్తానని శ్రీనివాస్ చెప్పారు.
Here's Video
లీగల్ ప్రోసీడింగ్స్ క్లియర్ అయితే తరువాత పెళ్ళే..... అంత వరకూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం..
తిరుమలలో దువ్వాడ ప్రియురాలు మాధురీ..#DuvvadaSrinivas #divvelamadhuri #tirumalatemple #AndhraPradesh #RTV pic.twitter.com/thRhfiJq9W
— RTV (@RTVnewsnetwork) October 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)