Earthquake in Uttarakhand: ఉత్తరకాశీలో భారీ భూకంపం, గత 48 గంటల్లో రాష్ట్రంలో ఇది రెండో సారి, అంతకుముందు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
- Read in
- తెలుగు
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఉత్తరకాశీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.గత 48 గంటల్లో రాష్ట్రంలో భూకంపం రావడం ఇది రెండోసారి. మంగళవారం పిథోరఘర్‌లో 4.3 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే రోజు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి.
Here's News
Earthquake of Magnitude:3.2, Occurred on 05-10-2023, 03:49:47 IST, Lat: 31.00 & Long: 78.29, Depth: 5 Km ,Location: Uttarkashi, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/aQfKwpUVIx @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/g68mMwjWsv
— National Center for Seismology (@NCS_Earthquake) October 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 05, 2023 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

