Iranian President Raisi Dead: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని వెల్లడి
ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు.
- Read in
- తెలుగు
ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్-ఇరాన్ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడానికి 2 నిమిషాల ముందు వీడియో ఇదిగో, కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది.
Here's PM Tweet
Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…
— Narendra Modi (@narendramodi) May 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2024 02:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

